05-02-2025 12:43:51 AM
ఎంఈఓ శ్రీ కె భాస్కర్ రెడ్డి
నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): విద్యార్థులు పాఠశాల స్థాయి నుండి సైన్స్ పట్ల మక్కువ పెంచుకుని బావి శాస్త్రవేత్తలుగా ఎద గాలని నాగర్ కర్నూల్ ఎంఈఓ భా స్కర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. మంగళవారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎఫ్ పిఎస్టి ఫారం ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ పరీక్షకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మా ట్లాడారు.
మారుతున్న సమాజం వా తావరణ పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాలలో అభిరుచిని పెంపొందించుకోవాలన్నా రు. ఈ కార్యక్రమంలో ఫోరం జిల్లా అధ్యక్షులు ఎం.నాగరాజు, జి.అంజ య్య, తిరుపతిరెడ్డి, గోపాల్ రెడ్డి, సుద ర్శన్, అంబికా, రజితలు పాల్గొన్నారు.