విద్యుత్ ఉద్యోగులపై నిందలు
బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్
ముఖ్యమంత్రి అనే సోయి లేకుండా బాధ్యతారాహిత్యంతో ఉద్యోగులపై నిందలు వేస్తూ వారి ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ రేవంత్‌రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకు ంటున్నాడని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. ఎక్స్ వేదికగా కేసీఆర్ ప్రభుత్వంలో లేని కరెంట్ కోతలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయనే అంశంపై స్పష్టత ఇవ్వకుండా ఉద్యోగులపై బట్టకాల్చి మీద వేయడం సరికాదన్నారు. ఏది మాట్లాడిన చెలామణీ అవుతుందని, అధికా ర దురహంకారాన్ని తీవ్రంగా ఖండించాలన్నారు.
విద్యుత్ శాఖలో హెల్ప ర్లు, లైన్‌మెన్లు ఇంకా చిన్న ఉద్యోగులు స్వతహాగా పేదవర్గాలకు చెంది న వారే ఎక్కువగా ఉంటారని, వారి పట్ల వివక్షతో చిన్నచూపు చూడటం సామాజిక నేరం అవుతుందన్నారు. ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదు నెలల్లో ప్రజలు జెనరేటర్స్, ఇన్వర్టర్స్ కొనుగోలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని, అనేక ఇళ్లలో టీవీలు, రిఫ్రిడ్జ్‌రేటర్లు, మోటార్ల ఎందుకు కాలిపోతున్నాయని ప్రశ్నించారు.
తన పనికిరాని వాచాలతను ఇకనైనా తగ్గించుకొని పాలనపై దృష్టి పెట్టాలని కోరారు. ప్రభుత్వం కరెంటు విషయంలో శ్వేతపత్రం ప్రకటించాలని ప్రస్తుతం తెలంగాణలో అన్ని రకాల విద్యుత్ ఉత్పత్తి, కొనుగోళ్లు, వినియోగం, ఇంకా అనేక వివరాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.