విద్యార్థుల రాస్తారోకో
నర్సాపూర్(మెదక్), ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): కౌడిపల్లి మండల కేంద్రంలో శాశ్వతంగా డిగ్రీ కళాశాల భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. కౌడిపల్లి లో జూనియర్ కళాశాల భవనంలోనే డిగ్రీ కళాశాలను షిఫ్ట్ పద్ధతిలో నడిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వివిధ గ్రామాల నుండి ఇక్కడికి వచ్చే విద్యార్థులకు ఆర్థిక భారం ఏర్పడుతుందని వాపోయారు. ఇక్కడ శాశ్వతంగా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసిన పాలకులు, అధికారులు పట్టిం చుకోవడంలేదని విమర్శించారు.
దీంతో గురువారం నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట రహదారిపై విద్యార్థులు రాస్తా రోకో ధర్నా చేపట్టారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానిక నాయకులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని నచ్చ చెప్పడంతో రాస్తారోకో విరమించారు.