calender_icon.png 26 December, 2024 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలువల విద్యను అందించాలి

25-08-2024 12:00:00 AM

మనం ఎందుకు మాట్లాడుతాం? మనలోని భావాలను, అభిప్రాయాలను, మన అవసరాలను ఇతరులకు తెలియజేయడాని కి, సంబంధ బాంధవ్యాలను పెంచుకోవడానికి మాట్లాడుతాం. మాట్లాడ డం అనేది చాలా రకాలుగా ఉంటుంది. మనిషి మాటతీరు ఆమనిషి ఎ లాంటి వాడో తెలియజేస్తుంది. ఒక మనిషితో కాస్సేపు మాట్లాడితే చాలు అతను ఎలాంటి వాడో తెలిసిపోతుంది. మనం మంచివాళ్లమా, వినయ విధేయతలు కలిగిన వాళ్లమా అనేది మనం మాట్లాడే తీరులోనే తెలిసిపోతుంది. మరి అలాంటి మంచి చిన్నారులకు కలగాలంటే చిన్ననాటినుంచే విలువలను, నీతి సూత్రాలను నేర్పాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

నైతికాభివృద్ధి అంటే కొన్ని నిబంధనలను అనుసరించడమో లేక ఎవరో ఏర్పర్చిన ఆదర్శ నమూనాల ప్రకారం నడుచుకోవడం మాత్రమే కాదు. నైతికాభివృద్ధి అంటే ప్రతిసందర్భంలోను సరైన కారణాలను తెలుసుకోవడం,విచక్షణతో నిర్ణయం తీసుకుని దానిప్రకారం నడుచుకోగలసామ ర్థ్యం కలిగి ఉండడం. కానీ నేటి సమాజంలో నైతిక విలువలు పతనమవుతున్నాయని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. దానికి కారణం మనలో స్వా ర్థం, దురాశ పెరగడం, అవినీతికి అలవాటుపడడం, నైతిక నియమావళిని ఉల్లంఘించడం. నేను, నాది వంటి అవలక్షణాల వల్ల వ్యక్తులు తమ జావితాన్ని సంక్లిష్టం చేసుకోవడంతో పాటుగా సమాజంలోని వాతావరణాన్నీ కలుషితం చేస్తున్నారు.

ప్రతి ఒక్కరిలో అశాంతి పెరుగుతూ నైతిక విలువల పతనంతో పాటు పెరిగిపోతున్న ఒత్తిడిని, కనుమరుగవుతున్న మానవతా విలువలు, మానవ సంబంధాలను మనం చూడవచ్చు. ఇవన్నీ ఒక రోజులోనో, సంవత్సరంలోనో వచ్చినవి కావు. ఎంతో కాలంగా మనం అలవా టు పడ్డ దురలవాట్ల వల్ల వచ్చినవే. వాటి ఫలితమే సమాజంలో అభద్రతాభావం, అపనమ్మకం, విచ్ఛిన్నమైన కుటుంబ వ్యవస్థ, విలువల పతనం, సమాజంలో అశాంతి వ్యాపించడం. వాటివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలంటే చిన్ననాటినుంచే చిన్నారులకు విలువల ను నేర్పడం అవసరమని భావించి దీనికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవచ్చు.

ఇందుకోసం విలువల విద్య, జీవన నైపుణ్యాలు అనే అంశాన్ని ఒక ప్రధాన సబ్జ్జెక్ట్‌గా అయిదో తరగతినుంచి పదో తరగతి వరకు ప్రవేశపెట్టడంద్వారా పిల్లలు పాఠశాల విద్య పూర్తయ్యే  నాటికి హేతుబద్ధమైన పౌరులుగా ఎదగడానికి అవసరమైన శిక్షణ పొందుతారు. బాధ్యతా యుతమైన పౌరులుగా ఎదగడానికి అవసరమైన పాఠ్యప్రణాళికను రాష్ట్ర విద్య, పరిశోధన, శిక్షణ సంస్థ రూపొందించింది.

పిల్లలు స్వేచ్ఛగా మాట్లాడడం, ప్రశ్నించడం, ప్రతిస్పందించడం, విచక్షణతో వ్యవహరించడం చేయ గలగాలని రాష్ట్ర విద్యా ప్రణాళికా పరిధిపత్రం 2011లోని రాష్ట్ర దృక్పథం లో పేర్కొన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని 1వ తరగతినుంచి 10వ తరగ తి వరకు విలువల విద్య, జీవ నైపుణ్యాల పాఠ్య ప్రణాళికను రూపొందించారు. విలువలు , వైఖరులు కలిగిన పౌరులుగా విద్యార్థులు ఎదగడానికి ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం. విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రత్యేక ప్రణాళికతో వారు ముందుకు వెళ్లాలి. అప్పుడే సత్ఫలితా లు లభిస్తాయి.  

గడప రఘుపతి రావు