ప్రస్తుత కాలంలో చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అయితే.. అన్ని రోగాలకు ప్రధాన కారణం అధిక బరువు అని.. దాన్ని నియంత్రణకు డైట్‌లో, జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. వాస్తవానికి ఈ రోజుల్లో చిన్నా, పెద్దా అనే తేడా లేకుం డా అన్ని వయసుల వారిని అధిక బరువు ఇబ్బంది పెడుతున్నది. ఇది వారి శరీర ఆకృతిని పాడు చేయడ మే కాకుండా మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్, గుండెపోటు వంటి వ్యాధులకు దారితీస్తుంది. పొట్ట స్లిమ్ అవ్వడానికి.. జిమ్‌కు, నడకకు వెళ్లడానికి సమయం ఉండదు. అలాంటి వారు తప్పనిసరిగా తమ ఆహారాన్ని మార్పుకోవాలి.. అప్పుడే ఆశించిన ఫలితం ఉంటుంది.
శరీర ఆకృతిని పొందడం, ప్లాట్ పొట్టను సొంతం చేసుకోవడం ఎవరికైనా సులభం కాదు. దీని కోసం మన రోజువారీ ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా పొట్టను తగ్గించుకోవాలనుకునే వారు రెగ్యులర్ వ్యాయామంతో పాటు.. కీర దోసను తీసుకోవాలి. దీన్ని తింటే సులభంగా బరువు తగ్గవచ్చు అంటు న్నారు డైటీషీయన్లు. కీర దోసకాయ తినడం వల్ల పొట్ట తగ్గడంతో పాటు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనం సాధారణంగా సలాడ్ రూపంలో కీర దోసకాయను తింటాం. ఇందులో నీరు సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. బరువును తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.