15-11-2024 12:16:06 AM
వాషింగ్టన్, నవంబర్ ౧౪: అమెరికా రాజ్యాంగం ప్రకారం ఓ వ్యక్తి రెండుసార్లు మాత్రమే అధ్యక్షుడిగా ఎంపికయ్యే అవకాశముంది. కానీ మూడోసారీ అధ్యక్షునిగా కావాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అధ్యక్షుడు బైడెన్‌తో భేటీకి ముందు రిపబ్లికన్ ప్రతినిధి సభ సభ్యులతో ట్రంప్ మాట్లాడారని, రాజ్యాంగ సవరణ చేసి మరో మారు ఎన్నికల బరిలో నిలవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఎన్నికల్లో మూడోసారి పోటీ చేయకుండా రాజ్యాంగంలోని 22వ సవరణ నిలువరిస్తుంది.
ఈ సవరణ రద్దు చేస్తేనే మూడోసారి పోటీలో ఉండే అవకాశముంటుంది. కానీ ఇది చాలా కష్టం. అమెరికా రాజ్యాం గం చాలా దృఢంగా ఉంటుంది. ఈ సవరణను రద్దు చేయాలంటే కాంగ్రెస్‌తో పాటు రాష్ట్ర చట్టసభల్లో 66 శాతం మెజారిటీ అవసరం ఉంటుంది. ప్రస్తుతం రిపబ్లికన్లకు ఈ స్థాయి మెజారిటీ లేదు.