calender_icon.png 10 January, 2025 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం అవ్వాలంటే జైలుకి వెళ్లాలి

09-01-2025 12:00:00 AM

పొలిటికల్ డైలాగులతో ‘రాచరికం’ ట్రైలర్ 

ఆర్జీవీ హీరోయిన్ అప్సర రాణి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాచరికం’. ఇందులో విజయ్‌శంకర్, వరుణ్ సందేశ్ కూడా కీలక పాత్రలు పోషించారు. సురేశ్ లంకలపల్లి, ఈశ్వర్ వాసె సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఈశ్వర్ నిర్మాత. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ మారుతి విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే ఇదొక విలేజ్ పొలిటికల్ రివేంజ్ డ్రామాగా అర్థమవుతోంది.

ఇందులో అప్సర రాణి రాజకీయ నేతల పాపులర్ డైలాగ్స్‌తో అదరగొట్టింది. ముఖ్యంగా ‘సీఎం అవ్వాలంటే జైలుకి వెళ్లాలి’ అనే కేటీఆర్ డైలాగ్‌తోపాటు వైఎస్ షర్మిల ఓ సందర్భంలో చెప్పిన ‘ఆడపిల్ల ఈడ పిల్లగాదు..’ అనే డైలాగ్ కూడా ఉంది.

‘రాచకొండ ఒక అడవిలాంటిదబ్బా.. ఈడ బలంతో పోరాడే పులులు, బలగంతో పోరాడే ఏనుగులు, ఎత్తుకుపై ఎత్తు వేసే గుంట నక్కలు, కాసుకుని కాటేసే విష సర్పాలు ఉంటాయి.. వాటి మధ్య జరిగే పోరులో రక్త పాతాలే తప్పా రక్త సంబంధాలు ఉండవు’ అన్న డైలాగ్ ఆకట్టుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 1న రిలీజ్ కానుంది.