వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
పీజేటీఎస్‌ఏయూ వజ్రోత్సవ లోగో విడుదల
హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలపాలని వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. 60 ఏళ్ల క్రితం ప్రారంభమైన విశ్వవిద్యాలయాన్ని మరింత ముందు కు తీసుకెళ్లాలని సూచించారు. మంగళవా రం విశ్వవిద్యాలయం వజ్రోత్సవ ఉత్సవాలు ఫ్లయర్, లోగోలను సైఫాబాద్‌లోని కమ్యూనిటీ సైన్స్ కళాశాలలో విడుదల చేశారు.
గతంలో విశ్వవిద్యాలయం సహా విద్యావ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని, చాలా ఏళ్ల తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ నియామకం జరిగిందన్నారు. ఈ అవకాశం వినియోగించుకొని విశ్వవిద్యాలయాన్ని గతం కంటే భిన్నంగా తీర్చిదిద్దాలని సూచించారు. దేశంలోనే మన రాష్ర్టం వ్యవసాయ రంగంలో అగ్రగామిగా ఉందని పేర్కొన్నా రు. సీఎం రేవంత్‌కు వ్యవసాయం అత్యంత ప్రాధాన్యత అంశమని, బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్దఎత్తున నిధులు కేటాయి స్తు న్నారని చెప్పారు.
ఈ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు విశ్వవిద్యాలయం భవిష్యత్తుని నిర్ణయించేలా ఉండాలని ప్రణాళికల్ని రూపొందించాలని ఆదేశించారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి సీఎం సలహాలు, ఆదేశా లు తీసుకోవాలని, అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లవేళలా తోడుంటుందన్నారు. అదేవిధంగా ఈనెల 30న మహబూబ్‌నగర్‌లో రైతు సదస్సు ఉంటుందని, 28 నుంచే ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకి ఆచరణలో ఉపయోగపడేలా ఈ ప్రదర్శనలు ఉండాలన్నారు.
సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, కోదండరెడ్డి సేవలను విశ్వవిద్యాలయం పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అనంతరం రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ప్రసంగిస్తూ వేడుకల ద్వారా భవిష్యత్‌కి సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయం మంచి సందేశం ఇవ్వాలని సూచించారు. ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, వీసీ అల్దాస్ జానయ్య పాల్గొన్నారు.