సిరిసిల్ల, డిసెంబర్ 23 (విజయ క్రాంతి): రబీ 2022-23 టెండర్ డెలివరీస్ను ఈ నెల 3వ లోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లాలోని రా అండ్ బాయిల్డ్ రైస్ మిల్లర్లతో సోమవారం సమీక్ష నిర్వహించారు. మిల్లుల వారీగా పెండింగ్ డెలివరీస్ మా ట్లాడారు. గడువులోగా చెల్లించాల్సిన రైసును అందజేయాలన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి పి. వసంత లక్ష్మి, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ రజిత, డిప్యూటీ తహసీల్దార్లు (సివిల్ సప్లయ్) నవీన్ కుమార్, రవీందర్ తదితరులు ఉన్నారు.