calender_icon.png 22 December, 2024 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరికీ అందుబాటులో ఉండేలా..

17-10-2024 12:00:00 AM

సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్- ద హంటర్’. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతోంది.

ఏసియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. దసరా సెలవులు ముగి యడంతో అందరికీ అందుబాటులో ఉండేలా తెలంగాణలో ఈ సినిమా టికెట్ ధరలను తగ్గించారు. మల్టీప్లెక్సుల్లో రూ. 200, సిటీ సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, డిస్ట్రిక్ట్ సింగిల్ థియేటర్లలో రూ. 110గా టికెట్ రేట్లను నిర్ణయించారు. ఈ రేట్లు అక్టోబర్ 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి.