21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పీ కృష్ణప్రదీప్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 31 (విజయక్రాంతి): 21st సెంచరీ ఐఏఎస్ అకా సహకారంతో వింగ్స్ మీడియా, జీ5 మీడియా గ్రూప్‌ల ఆధ్వర్యంలో కొంపల్లిలోని సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ‘మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్‌ను ఎలా ఛేదించాలి’ అనే అంశంపై గురువారం నిర్వహించిన సెమినార్ విజయవంతమైంది. ఈ సందర్భంగా 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పీ కృష్ణప్రదీప్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ..
ఒకరి చిరునామా అవసరమైన వారికి మనం ‘కేర్- ఆఫ్ అడ్రస్’ గా నిలిచే స్థితిలో ఉండాలని, అది మనకి గౌరవాన్ని అందిస్తుందని అన్నారు . ‘దబాంగ్ ఆఫీసర్’గా ప్రసిద్ధి చెందిన ఐఏఎస్ అధికారి అమిత్ కటారియా గురించి చెబుతూ తన భార్య ఆదాయం ద్వారా తన కుటుంబాన్ని పోషిస్తూ కేవలం ఒక రూపాయిని తన జీతంగా తీసుకొని దేశం కోసం నిస్వార్థ సేవ చేస్తున్నారని.. విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రిపేర్ అవ్వాలని చెప్పారు.
21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చీఫ్ మెంటర్ మరియు డైరెక్టర్ డాక్టర్ భవానీ శంకర్ మాట్లాడుతూ.. ఐఐటీలు మరియు ఐఐఎంల వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు మాత్రమే సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలరనే అపోహను కొట్టిపారేశారు.
6వ తరగతి పాఠ్యాంశాల్లోని అనేక యూపీఎస్సీ ప్రశ్నలు కాన్సెప్ట్ ఆధారంగానే ఉంటాయి కాబట్టి సాధారణ డిగ్రీ కళాశాలల విద్యార్థులు కూడా విజయం సాధించవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో లో సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కళాశాల గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పీ సంతోష్ కుమార్ పాత్ర, ప్లేస్మెంట్ ఆఫీసర్ గార్ల రమేశ్, వింగ్స్ మీడియా డైరెక్టర్ శ్రీగిరి ప్రకాష్ , ఎడిటర్ శ్రీ గణేష్, మేనేజర్ ప్రసాద్ -మేనేజర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.