calender_icon.png 24 October, 2024 | 11:49 PM

అందాల ‘ఓ భామ’కి..

07-07-2024 12:05:00 AM

‘జో’ సినిమాతో కథానాయికగా పరిచయమైన మాళవిక మనోజ్, ప్రస్తుతం ప్రేమకథా చిత్రమైన ‘ఓ భామ అ య్యో రామ’లో సుహాస్ సరసన నటిస్తోంది. వి ఆర్ట్స్, చిత్రలహరి టాకీస్ పతాకంపై హరీష్ నల్లా, ప్రదీప్ తళ్లపురెడ్డి  నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ గోదాల దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం హీరోయిన్ మాళవిక మనోజ్ పుట్టినరోజు కావడంతో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్‌ని విడుదల చేసింది. ప్రస్తు తం చిత్రీకరణ దశలో ఉన్న ‘ఓ భామ అయ్యో రామ’ త్వరలో ప్రేక్షకుల ముం దుకు రానుంది. అనిత హస్సా నందని, అలీ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: మణికందన్, సంగీతం: రథన్, ఆర్ట్ : బ్రహ్మా కడలి.