హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 14(విజయక్రాంతి): ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతిని శనివారం టీఎన్‌జీవోస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్ట ర్.ఎస్‌ఎం హుస్సేనీముజీబ్, సంఘం నాయకులు దర్శించుకున్నారు. దేశంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రజలకు ఉపశమనం కలిగించాలని విఘ్నేశ్వరు డిని వేడుకున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు కేంద్ర సంఘ ప్రచార కార్యదర్శి శైలజ, క్రీడా కార్యదర్శి బొల్లిగిద్ద శంకర్, హైదరాబాద్ అధ్యక్షుడు రాజ్‌కుమార్, సంయుక్త కార్యదర్శి వైదిశస్త్ర తదితరులు గణనాథుడిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.