కరీంనగర్ సిటీ, జనవరి 1: నూతన సంవత్సరం 2025 వేడుకలను పురస్కరిం చుకొని తెలంగాణ ఎన్జీవోల సంఘం జిల్లా ఎంప్లాయిస్ జేఏసి ఛైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులతో కలిసి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతీకి పులమొక్కను అందజేసి నూతన సంవత్సర శుభాకంక్షలు తెలియజేశారు. వేడుకల సందర్బంగా బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లోని ఛాంబర్లో జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికా రి సుధాకర్ సూచనల మేరకు పెద విద్యార్థు లకు ఉపయోగపడే పుస్తకాలు, నోట్ బుక్స్, పెన్నులను జిల్లా కలెక్టర్‌కు అందచేశారు.
అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జి ల్లా కలెక్టర్ నిరాడంబరంగా దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు నివాళు లు అర్పిస్తూనే ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటు వంటి ఉద్యోగులు, ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకువెళ్లి ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్ కోరడం జరి గిందన్నారు.
ప్రభుత్వాలు ప్రజలు ఉద్యోగు లు వేరు కాదని అందరూ ఒక్కతాటిపై నడిస్తే రాష్ర్ట అభివృద్ధి సాధ్యమని తెలపడం జరి గిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వ హణలో అంకితభావంతో పనిచేసి ప్రభుత్వా నికి మంచి పేరు తీసుకురావాలని ఆదేశిం చారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే ఉద్యోగులకు నా ఆశీస్సులు ఎల్లపు డూ అందుతాయని కలెక్టర్ మాతో అనడం సంతోషంగా ఉందన్నారు.
జిల్లా కార్యదర్శి సంగేం లక్ష్మణరావు, టీజీవోల జిల్లా అధ్యక్షు డు మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, కార్యదర్శి అరవింద్ రెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోట రామ స్వామి, పెన్షన్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు పెండ్యాల కేశవరెడ్డి, ఎలదాసరి లింగయ్య, డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు వెంకటయ్య, మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శారద, సబితా సునీత, శైలజ, విజయలక్ష్మి, హరిప్రియ, నాయకులు ముప్పిడి కిరణ్ కు మార్, నాగుల నరసింహస్వామి, రాగి శ్రీని వాస్, ప్రభాకర్ రెడ్డి, నరసింహారావు, సర్దార్ హర్మీందర్ సింగ్, ఒంటెల రవీందర్ రెడ్డి, రాజేష్ భరద్వాజ్, సుమంత్ రావు, గంగార పు రమేష్, ప్రసాద్ రెడ్డి, వాస్తవిక్ శ్రీమాన్ రెడ్డి, పోలు కిషన్, కామ సతీష్, కరుణాకర్, జలాలుద్దిన అక్బర్, పత్తేం శ్రీనివాస్, కొండ య్య, అక్బర్ మన్మీత్ సింగ్, భాస పవన్ కుమార్, రాజేశ్వరరావు, రామ్మోహన్, మ హేందర్ రెడ్డి, రాజు నాయక్, అభినయ రెడ్డి, విజయ్, అస్గర్, కమలాకర్, లవ కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు