calender_icon.png 30 April, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఎన్జీవో పాఠశాల విద్య సిబ్బంది కమిటీ ఎన్నిక

29-04-2025 09:48:05 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): టీఎన్జీవో పాఠశాల విద్యాశాఖ సిబ్బంది మహబూబాబాద్ జిల్లా శాఖ ఎన్నికలు మంగళవారం తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ సెంట్రల్ ఫోరం అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.దేవేందర్ ఆధ్వర్యంలో జరిగాయి. అధ్యక్షునిగా ఏం.గణేష్, కార్యదర్శిగా ముజాహిద్ అలీ, అసోసియేట్ అధ్యక్షులుగా సిహెచ్.శ్రీనివాసరావు, ఎస్.బి శ్రీనివాస్, ఉపాధ్యక్షునిగా ఎం. రమేష్, కోశాధికారిగా ఎం. శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి టిఎస్ఇసిఎఫ్ కార్యదర్శి ఎం.డి ఫక్రుద్దీన్ అహ్మద్, కోశాధికారి పవన్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ అశోక్, ప్రచార కార్యదర్శి దిలీప్ కుమార్ యాదవ్, టీఎన్జీవో మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు వి.శ్రీనివాస్, కోశాధికారి రోహిత్, స్పోర్ట్స్ సెక్రటరీ రంజిత్ పాల్గొన్నారు.