calender_icon.png 19 April, 2025 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్‌గా టీఎన్జీవో నా శెట్టి సుమన్ కుమార్

19-04-2025 12:33:10 AM

నిజామాబాద్ ఏప్రిల్ 18:(విజయ క్రాంతి) : తెలంగాణ ఉద్యోగ గెస్ట్ అధికారుల ఉపాధ్యాయుల కార్మిక మరియు పెన్షనర్ల జైంట్యాక్షన్ కమిటీ టీజీఈ జెఎసి సమావేశం నిజామాబాద్ నగరంలోని ఎన్జీవోస్ కార్యాలయంలో  జరిగింది. రాష్ట్ర చైర్మన్ శ్రీమారం జగదీశ్వర్ రాష్ట్ర సెక్రెటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్ ఆదేశం మేరకు శుక్రవారం రోజు ఈ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా టి జి ఓ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్  మాట్లాడుతూ.. గౌరవ  టీజేఇఏసీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు టీఎన్జీవోస్’ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ పేరును ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ పదవికి  ప్రతిపాదించారూ టీజీఏజేఏసీజీఏజేఏసీ  భాగస్వామ్య సంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులందరూ హర్షద్వానాల మధ్య చప్పట్లతో, అంగీకరించగా, ఎంప్లాయిస్  జేఏసీజిల్లా చైర్మన్  శ్రీ నాశెట్టి సుమన్ కుమార్ ని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు.

టీజీఈ జేఏసీజిల్లా కన్వీనర్ గా టిజీవో జిల్లా అధ్యక్షులు శ్రీ అలుక కిషన్  కో కన్వీనర్ గా పి ఆర్ టి యు మోహన్ రెడ్డి  ని కో చైర్మన్ లు గా యూటీఎఫ్ రమేష్  టి జి ఆర్ ఈ ఎస్ ఏ రమణ రెడ్డి ఎస్ టి యు ధర్మేందర్ , క్లాస్ ఫోర్ అసోసియేషన్ శ్రీనివాస్ టి ఆర్ టి ఎఫ్ కృష్ణారెడ్డి టి పి టి ఎఫ్, సురేష్ టి టి యు, రాము లతీకర్ ప్రభుత్వ జై ఎల్ ఎస్ ఏ ఎస్ ఎస్ ఎన్ నర్సయ్య డి టి ఎఫ్  బాలయ్య ,

పెన్షనర్ అసోసియేషన్ రవీందర్ గారు వైస్ చైర్మన్ గా టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్  టీ జీవో జిల్లా కార్యదర్శి సంఘం అమృత్ కుమార్   ఫైనాన్స్ సెక్రటరీ జాకీర్ హుస్సేన్  తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర కమిటీ తెలిపిన 57 అంశాలపై ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు జిల్లాలో ఉద్యమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు.