12-02-2025 02:49:05 PM
టూ టౌన్ సీఐని కలిసిన తెలంగాణ ఉద్యమకారులు
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్న తమపై ఇంకెన్నాళ్లు కేసులో చుట్టూ తిరగాలని ఉద్యమకారుడు టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్ర నాయక్(TNGO District General Secretary Chandra Nayak) ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో చేపట్టిన సకల జనుల సమ్మె(Sakala Janula Samme)లో భాగంగా అప్పుడు బస్సులను నిలిపివేయడం జరిగిందని, ఆ సమయంలో నమోదైన కేసు ఇంకా కొనసాగుతుందని తెలిపారు. ఈ విషయంపై రూరల్ సీఐ ఇజాజోద్దిన్(Mahabubnagar Rural CI Ijazuddin) కలిశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ... చట్ట ప్రకారం ముందుకు సాగవలసిన అవసరం ఉందని, కేసుల తొలగింపు తదితర ప్రక్రియ ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశమని తెలిపారు. ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోయి తదుపరి చర్యలు తీసుకుంటామని ఉద్యమకారులకు సూచించారు. ఈ సమావేశంలో ఉద్యమకారులు ఉన్నారు.