చెన్నై: బాలీవుడ్‌పై తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దక్షిణాదిలో చిత్ర పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. బాలీవుడ్‌లో హిందీ సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. మరాఠీ, బోజ్‌పురి,బిహారీ, హర్యానా, గుజరాత్ సినిమాలను తొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాలకు సొంత చిత్ర పరిశ్రమలే లేవని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు.