05-04-2025 04:18:07 PM
బైంసా (విజయక్రాంతి): తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ పిలుపుమేరకు ఈనెల 7న హైదరాబాదుకు తరలిరావాలని టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు వీఆర్ రెడ్డి శనివారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను డిమాండ్లను ప్రస్తావించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులు కొని ఆర్టీసీకి ఇవ్వాలి. యూనియన్ లపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలన్నారు.