calender_icon.png 20 October, 2024 | 5:29 AM

కృత్రిమ మేధకు టీఎంటీ జై

20-10-2024 01:40:44 AM

  1. టెక్నాలజీ, మీడియా, టెలికంలో జోరు
  2. ఖర్చులు తగ్గించి లాభాలు పెంచుతున్న ఏఐ
  3. సేవల్లో వేగం, ఖచ్చితత్వంతో పరుగులు
  4. 55 శాతం కంపెనీల్లో ఏఐ వినియోగం
  5. టెలికంలోనే ‘ఏఐ’ వినియోగం ఎక్కువ
  6. కేపీఎంజీ నివేదికలో వెల్లడి 

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయ క్రాం తి): ప్రపంచమంతా సాంకేతికతపై ఆధారపడి ముందుకు సాగుతోంది. ఆ దిశలో భారతదేశం అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తు న్నది. ప్రపంచ దేశాలకు టెక్నాలజీ హబ్‌గా నిలుస్తున్నది. సాంకేతిక అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పనితీరును సులభతరం చేసింది.

క్రమంగా అన్ని రంగాల్లో విస్తరిస్తూ మెరుగైన వృద్ధిని కనబరుస్తుంది. ముఖ్యంగా టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్ (టీఎంటీ) రంగాల్లో ఏఐ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. దేశంలోని టెక్నాలజీ, మీడియా, టెలికాం విభాగాల్లో పెరుగుతున్న ఏఐ ప్రభావంపై కేపీఎంజీ సంస్థ ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది.

టీఎంటీ విభాగాల్లో ఏఐ వినియోగించడం వల్ల ఖర్చు తగ్గి ఉత్పాదకత పెరిగిందని పేర్కొంది. టీఎంటీ రంగంలోని వివిధ కంపెనీలకు చెందిన చీఫ్ డిజిటల్ ఆఫీసర్లు (సీడీవో), చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీఐవో), చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో)లను సంప్రదించి ఈ రిపోర్టు రూపొందిం చినట్టు తెలిపింది.

టెలికాం రంగంలో నెట్‌వర్క్‌ను ఆటోమేట్ చేయడం నుంచి మీడియా రంగంలో కంటెంట్‌ను పంపిణీ చేయడం వరకు ఏఐ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నదని నివేదికలో తెలిపింది. 

55 శాతం కంపెనీల్లో ఏఐ వినియోగమే

టీఎంటీ రంగాలకు చెందిన కంపెనీ కార్యనిర్వహణలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. ఏఐ వినియోగంతో సామర్థ్యం పెరగడంతోపాటు నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుంది. టీఎంటీ రంగాలకు చెందిన 55 శాతం కంపెనీలు పూర్తిస్థాయిలో ఏఐని వినియోగిస్తున్నా యని కేపీఎంజీ సర్వేలో తేలింది. 37 శాతం కంపెనీల్లో ఏఐ వినియోగం వివిధ దశల్లో ఉందని వెల్లడించింది.

ఏఐ ఆధారిత ఆవిష్కరణల ద్వారా 5 నుంచి 10 శాతం నిర్వహణ వ్యయం తగ్గించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే అద్భుత పనితీరును కనబర్చినట్టు పేర్కొంది. దీంతోపాటు ఏఐ ఆధారిత పెట్టుబడుల్లో 10 శాతం కంటే ఎక్కువగానే రాబడిని గుర్తించినట్టు నివేదికలో వెల్లడించింది. 

‘ఏఐ’తో వార్తలు 

మీడియా రంగంలో నూతన ఒరవడికి అడుగులు పడుతున్నాయి. టెలివిజన్‌లో ఏఐ సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే దేశంలోని ఆయా భాషల్లో ఏఐ యాంకర్‌తో వార్తలు చదివించారు. తెలుగులోనూ ఏఐ సాంకేతికతతో రూపొందించిన యాంకర్‌ను వినియోగించారు. ఏఐ యాంకర్ కూడా నిజమైన యాంకర్ లాగానే స్పష్టంగా వార్తలు చదువుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఈ ఏఐ యాంకర్ తరచుగా కనురెప్పలు ఆడిస్తూ, కొన్ని ముఖ కవళికలతో మనుషుల్లాగానే వార్తలను చదువుతుంది. మీడియా రంగంలో వర్చువల్ యాంకర్‌తో వార్తలు చదివించే ప్రయోగం ఎంతో విజయవంతమైంది. వర్చువల్ యాంకర్ ద్వారా పనిభారం తగ్గడంతోపాటు, సులభతరం అవుతున్నది. 

‘టీఎంటీ’ వృద్ధికి కేపీఎంజీ సూచనలు

టీఎంటీ రంగం వృద్ధి చెందాలంటే పాటించాల్సిన విధానాలను కేపీఎంజీ నివేదిక పలు సూచనలు చేసింది. మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోవాలని, ఖర్చులను తగ్గించడానికి నెట్‌వర్క్ ఆటోమేషన్‌పై దృష్టి సారించా లని సూచించింది.

5జీ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో పెట్టుబడి పెట్టాలని, కస్టమర్ల పెంపునకు ఏఐ సొల్యూషన్లను అందించాలని, అందుకు హెల్త్‌కేర్, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి పరిశ్రమలతో భాగస్వామ్యం కావాలని పేర్కొంది. సంస్థల సేవలు వేగవంతం చేయడానికి ప్రత్యేక ఏఐ ప్రొవైడర్లతో కలిసి పనిచేయాలని తెలిపింది.

సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించాలని, విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం ద్వారా నైపు ణ్యాలు పెంపొందించుకోవచ్చని కేపీఎంజీ వెల్లడించింది. కృత్రిమ మేధ వినియోగం పెరగడం ద్వారా టీఎంటీ పరిశ్రమ మరింత వృద్ధి సాధిస్తుందని, టీఎంటీ రంగాలతోపాటు విభి న్న రంగాల్లో కూడా ఏఐ వినియోగం పెరగితే కంపెనీలకు మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని పలు కంపెనీల ప్రతినిధులు అభిప్రాయపడినట్టు నివేదికలో స్పష్టం చేసింది. 

నివేదకలోని కీలకాంశాలు..

* 40 శాతం కంపెనీలు తమ కార్యకలాపాలు, నిర్ణయాత్మక ప్రక్రియల్లో మెరు గైన అంచనాను సాధించడానికి ఫైనా న్స్, హెచ్‌ఆర్ విభాగాల్లో ఏఐని వాడుతున్నాయి.

* 13 శాతం కంపెనీలు ఇప్పటికే ఏఐ సాంకేతికతలను స్వీకరించే ప్రారంభ దశలో ఉన్నాయి. 

* టెలికమ్యూనికేషన్ రంగంలో ఎక్కువ గా ఏఐని వినియోగించాలని భావిస్తున్నారు.

* టెలికం రంగంలో ఏఐ ద్వారా సేవల నాణ్యత 30 శాతం మెరుగుపడుతుందని కంపెనీలు అభిప్రాయపడుతున్నా యి. రాబడి వృద్ధి 26 శాతం, మోసాల నివారణ 32 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి. 

* సర్వేలో పాల్గొన్న 26 శాతం కంపెనీల్లో ఏఐ ఎకోసిస్టమ్ అనుసరించేందుకు సరైన మానవ వనరులు లేవు. 33 శాతం కంపెనీల్లో వర్క్‌ఫోర్స్‌లో 30 నుంచి 50 శాతం మంది 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఏఐ వాడకానికి సిద్ధమవుతున్నారు. 

* 27 శాతం కంపెనీలు ఏఐ వినియోగానికి అధికంగా ఖర్చు చేయాల్సి ఉం టుందని భావిస్తున్నాయి. 

* 52 శాతం సంస్థలు ఏఐ వినియోగంతో మెరుగైన కస్టమర్ సేవలను అందించే అవకాశం లభిస్తుందని అభిప్రాయపడుతున్నాయి.

* 80 శాతం టీఎంటీ రంగాలకు చెందిన కంపెనీల సీఈవోలు స్కిల్ డెవలప్‌మెంట్‌పై పెట్టుబడి పెట్టడం సంస్థలకు ఎంతో అవసరమని తెలిపినట్టు కేపీఎంజీ సర్వేలో స్పష్టం చేసింది.