21-02-2025 10:32:17 PM
ఎమ్మెల్సీ కోదండరాం..
హైదరాబాద్ (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం ప్రకటించారు. కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి వై.అశోక్ కుమార్, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డి, కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికు కోదండరాం మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో వీరిని గెలిపించాల్సిన అవసరముందని ఆయన పిలుపునిచ్చారు. రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన చెప్పారు.
నిందుతులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా, గోదావరి నీటి వాటా కోసం ఇప్పటికైనా పోరాటం ముమ్మరం చేయాలన్నారు. పదేళ్ల పాలనలో ఏమీచేయకుండా, ఇప్పుడు విమర్శలు చేయడం హరీష్ రావుకు తగదన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ ప్రధానకార్యదర్శి బైరి రమేష్, పల్లె వినయ్ కుమార్, నాయకులు సర్దార్ వినోద్ కుమార్, హన్మంత రెడ్డి, సత్యనారాయణ, రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.