calender_icon.png 24 February, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ అభ్యర్థికి టీజేఏసీ సంపూర్ణ మద్దతు

24-02-2025 07:00:43 PM

భీమదేవరపల్లి: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు జేఏసీ మండల శాఖ అధ్యక్షులు డేగల సారయ్య తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేయడమే కాకుండా స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించడం గొప్ప పరిణామం అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ జేఏసీ మద్దతు కోరడం వల్ల హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు జేఏసీ మద్దతు తెలుపుతున్నట్లు పట్టభద్రులైన ఓటర్లు విజ్ఞతతో నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో జేఏసీ నాయకులు కవ్వ లక్ష్మారెడ్డి, డాక్టర్ ఎద్దులాపురం తిరుపతి, ఆదరి శ్రీనివాస్, కొంగల రామచంద్రారెడ్డి, ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.