calender_icon.png 8 February, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12న టైటిల్ అనౌన్స్

08-02-2025 12:00:00 AM

హీరో విజయ్ దేవరకొండ ఇటీవలే ‘వీడీ 12’ మొదలు పెట్టేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పటివరకు ‘వీడీ 12’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాగవంశీ నిర్మాతగా రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన ఒకటి వచ్చేసింది. సినిమా టైటిల్, టీజర్ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ నెల 12న సినిమా టైటిల్, టీజర్ విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఒక క్రేజీ పోస్టర్‌తో ప్రకటించారు. ‘రాజు కోసం ఒక నిశ్శబ్ద కిరీటం వేచి ఉంది’ అంటూ ఒక క్రౌన్‌తో కూడిన పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. విజయ్‌తో గౌతమ్ మాసివ్ సినిమా చేస్తున్నట్టు సమాచారం.

ముఖ్యంగా నిర్మాత నాగవంశీ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని పలు సందర్భాల్లో వెల్లడించడంతో విజయ్ అభిమానులు సైతం సినిమా సక్సెస్‌పై గట్టి నమ్మకంతో ఉన్నారు.

తాజాగా నాగవంశీ అయితే దర్శకుడు గౌతమ్ తిన్ననూరిని హింస పెట్టి మరీ టైటిల్‌ను లాక్ చేయించినట్టు తెలిపారు. త్వరలోనే టైటిల్ రివీల్ చేస్తామని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ఫిబ్రవరి 12న టైటిల్, టీజర్ విడుదల చేయనున్నారు. ఈ ప్రకటన, క్రౌన్ పోస్టర్ చూసి టైటిల్ ఏమై ఉంటుందా? అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఈ సినిమాకి ‘సామ్రాజ్యం’ అనే టైటిల్ అయితే ప్రచారంలో ఉంది.