calender_icon.png 15 November, 2024 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టైటాన్ లాభం 23 శాతం డౌన్

06-11-2024 12:00:00 AM

హైదరాబాద్, నవంబర్ 5: జ్యువెలరీ, లైఫ్ స్టుల్ కంపెనీ టైటాన్ నికరలాభం ఈ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 23 శాతం క్షీణించి రూ. 704 కోట్ల వద్ద నిలిచింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ. 916 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. తాజా త్రైమాసికంలో కంపెనీ అమ్మకాల ఆదాయం మాత్రం 25.8 శాతం వృద్ధితో రూ. 10,708 కోట్ల నుంచి రూ. 13,473 కోట్లకు చేరింది.

అయితే మెటీరియల్స్, విడిభాగాల వ్యయాలు గణనీయంగా పెరగడంతో టైటాన్ లాభాలు  తగ్గాయి. లాభదాయకతను సూచించే కంపెనీ ఇబిటా మార్జిన్ భారీగా 14.2 శాతం నుంచి 430 బేసిస్ పాయింట్లు తగ్గి 9.9 శాతానికి పడిపోయింది. వాచెస్, వేరబుల్స్, ఐ కేర్ విభాగాల ద్వారా లాభాలు పెరిగినప్పటికీ, జ్యువెలరీ విభాగం లాభం 19.96 శాతం తగ్గిందని టైటాన్ తెలిపింది.