న్యూఢిల్లీ, నవంబర్ ౧౭: పడవ మునిగిపో యిన అధ్యాయం.. కానీ టైటా నిక్ గురించి ఎటువంటి వార్త వచ్చినా కానీ అందరిలో ఒక రకమైన ఉత్సుకత కనిపి స్తుంది. ఆనాటి దుర్ఘటనలో దాదాపు 700 మంది ప్రాణా లు కాపాడిన షిప్ కెప్టెన్ ఆర్థ్రర్ రాస్టాన్ బంగారు గడియారా న్ని వేలం వేయగా అది అక్షరాలా 1.96 మిలి యన్ల (రూ. 16.5 కోట్లు) డాలర్లకు అమ్ముడు పోయింది.
ఎందుకంత ప్రత్యేకమంటే..
1912లో విలాసవంత నౌక టైటానిక్ అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఆనాటి విషాద ఘటనలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ షిప్ కెప్టెన్‌గా కెప్టెన్ ఆర్థర్ రాస్ట్రాన్ పుణ్యమాని అనేక మంది బతికి బట్టకట్టారు. ఇప్పుడు అదే గడియారాన్ని వేలం వేయగా.. అది రికార్డు ధర పలికింది. టైటానిక్‌కు సంబంధించి ఏదైనా ప్రత్యేకమే. అటువంటిది నాటి ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన కెప్టెన్ రాస్ట్రాన్ పాకెట్ గడియారాన్ని వేలం వేయగా.. వేలం ప్రియులు ఎగబడ్డారు.
చివరికి అది రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు నిర్వాహకులు తెలిపారు. టిఫ్పానీ కంపెనీకి చెందిన ఈ పాకెట్ వాచ్ 18 క్యారెట్ గోల్డ్ వాచ్..
బహుమతిగా..
ఈ వాచ్‌ను నాటి కెప్టెన్‌కు సంపన్నులైన ముగ్గురు వితంతువులు బహుమతిగా ఇచ్చారు. కెప్టెన్ ఆర్థర్ ఎంతో మంది ప్రాణాలను రక్షించాడు. కెప్టెన్ చాకచక్యంగా వ్యవహరించి ఉండకపోయి ఉంటే మరింత మంది ప్రాణాలు జలసమాధి అయ్యేవి. ‘ప్రాణాలతో బయటపడ్డ ముగ్గురు కెప్టెన్‌కు హృదయపూర్వకంగా సమర్పించిన కానుక’ అని ఆ వాచ్ మీద రాసి ఉంది.