తాము చని పోబోతున్నాం అని ముందే తెలిస్తే ఎవరైనా ఎలా భయ భ్రాంతులకు.. గురవుతారు ?అదీ టైటాన్ లాంటి మినీ జలాంతర్గామిలో.. కార్బన్ ఫైబర్ పగులుతున్న చప్పుళ్లు వినిపిస్తూ, కనిపిస్తూ.. సబ్ మెరైన్ సిబ్బందికి హర్రర్ సినిమా మాదిరి వినిపించినట్లు తాజాగా దాఖలు చేసిన ఓ లా సూట్ లో పేర్కొన్నారు. 2023 జూన్లో అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన టైటాన్ మినీ జలంతర్గామి విషాదం జరిగిన విషయం తెలిసిందే. టైటాన్ మినీ జలాంతర్గామికి ప్రయాణంలో సమస్యలు ఎదుర్కొన్న చరిత్ర ఉందని.. కానీ ఈ ఓషన్ గే ట్ సంస్థ సైతం ఉద్దేశ్య పూర్వకంగానే వాస్తవాలను దాచి పెట్టిందంటూ ఒక లాసూట్ దాఖలు అయ్యింది.
టైటాన్ ప్రయాణం మొదలైన 90 నిమిషాలకే అది సముద్రం తాలూకు బాహ్య ఒత్తిడి తట్టు కోలేని స్థితికి చేరింది. దీంతో అందులో ప్రయాణించే వారికి దాని అసలు సామర్థ్యం అర్థమయ్యి తమ అంతిమ ఘడియలు సమీపించిన విషయం తెలిసిపోయింది. లోతుకు వెళుతున్న కొద్ది నీటి బరువు పెరిగి టైటాన్ కార్బన్ ఫైబర్ పగులుతున్న చప్పుళ్లు వినిపించే ఉంటాయన్నారు. అంతలోనే కమ్యూనికేషన్, విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. చివరికి అది నీటి ఒత్తిడి తట్టుకో లేక నలిగి ముక్క లైంది. కాగా ఫ్రాన్స్ దేశ పైలట్ పాల్ హెన్రీ కి టైటాన్ లోపాలు ముందే చెప్పకుండా ఎందుకు దాచి పెట్టారనే దే లా సూట్ లో ప్రధాన ఆరోపణగా పేర్కొన్నారు.