వైస్ చైర్మన్‌గా బంక చందు
రెండేండ్ల కాలానికి పాలకవర్గం ఏర్పాటు
హుస్నాబాద్, నవంబర్ 22: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీకి పాలకవర్గం ఏర్పాటైంది. చైర్మన్‌గా కంది తిరుపతిరెడ్డి నియమితులయ్యారు. వైస్ చైర్మన్‌గా హుస్నాబాద్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బంక ఐలయ్య అలియాస్ చందును నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా బొడిగె పర్శరాములు, పత్తిపాక తిరుపతి, ఓరుగంటి భారతి, పోతుగంటి బాలయ్య, మహ్మద్ కుతుబోద్దీన్, బొంగోని శ్రీనివాస్, లావుడ్యా బిక్యా, మడప యాదవరెడ్డి, కరంటోత్ రవి, బైకని శ్రీనివాస్, తేరాల మారుతి, తనుకు ఆంజనేయులను నియమించారు. వీరితోపాటు జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్, హుస్నాబాద్ ఏడీఏ, మున్సిపల్ చైర్పర్సన్ ఏఎంసీలో సభ్యులుగా ఉంటారు.