10-02-2025 02:03:47 PM
శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి 20 ప్రత్యేక బస్సులు, 150 ట్రిప్పులు అంటున్న ఆర్టీసీ
ప్రయాణికుల రాకపోకులకు తొలగనున్న ఇబ్బందులు
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): పేదల తిరుపతి మన్నెంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆర్టీసీ మరో అడుగు ముందుకేసింది. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ నెల 12వ తేదీ నుంచి మార్చి 13వ తేదీ వరకు 20 ప్రత్యేక మినీ బస్సులను తిప్పెందుకు ఏర్పాట్లు చేసింది. ఈ బస్సులో ధర ప్రతిరోజు 150 ట్రిప్పులను మహబూబ్ నగర్, నారాయణపేట్ ల నుంచి మన్నెంకొండ దేవాలయం వరకు తిప్పనుంది. భక్తుల రద్దీపనలకు తీసుకొని మరిన్ని బస్సులు అవసరం మేరకు తిప్పనట్లు ఆర్టీసీ ఆర్ఎం సంతోష్ కుమార్ తెలియజేశారు. కేవలం మినీ బస్సులు మాత్రమే కొండపైకి వెళ్లేందుకు అనుమతి ఉందని ప్రయాణికులు గమనించాలని సూచించారు.