10-04-2025 02:31:08 AM
ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్
6 లైన్ జిరాక్‌పూర్ బైపాస్‌కు కూడా..
న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర క్యాబి నెట్ కమిటీ తిరుపతిెవూొకాల్ కాట్పాడి మధ్య డబ్లింగ్ పనులకు ఆమోదం తెలిపిం ది. ఈ ప్రాజెక్టు కోసం రూ. 1,332 కోట్లు ఖర్చు కానున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని మూడు జిల్లాలను కవర్ చేయనుంది. ఈ ప్రాజెక్టు భారతీయ రైల్వేల నెట్‌వర్క్‌ను ఎంతో పెంచనుంది. ‘డబ్లింగ్ పనులతో ఈ ప్రాంతాలు పర్యాట కంగా ఎంతో అభివృద్ధి చెందేందుకు ఆస్కా రం ఉంటుంది.
ఇక్కడికి లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తారు. తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోట వంటి ప్రాంతాలు ఈ డబ్లింగ్ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ డబ్లింగ్ పనుల తో 400 గ్రామాల్లోని 14 లక్షల మంది జనాభాకు లబ్ధి చేకూరనుంది. 35 లక్షల పని దినాలు కల్పించే ఆస్కారం ఉంది. ఏడాదికి 4 మిలియన్ టన్నుల సరకు రవాణాకు అవకాశం ఉంటుంది’ అని మంత్రి పేర్కొన్నా రు. ప్రతిపాదిత రైల్వే మార్గంలో 15 స్టేషన్లు, 17 మేజర్ బ్రిడ్జిలు, 327 మైనర్ బ్రిడ్జిలు, 7 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, 30 రోడ్ అండర్ బ్రిడ్జిలు, ఉన్నాయి.
జిరాక్‌పూర్ బైపాస్‌కు కూడా..
రూ. 1,878 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆరు లైన్ల జిరాక్‌పూర్ బైపాస్‌కు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఉండే ఈ బైపాస్ పొడ వు 19.2 కిలోమీటర్లు. పటియాలా, ఢిల్లీ, మొహాలీ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను తగ్గిం చడం, హిమాచల్‌ప్రదేశ్‌కు డైరెక్ట్ కనెక్టివిటీని అందించడం కోసం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశించబ డిందని మంత్రి పేర్కొన్నారు. 2025 కాలానికి ప్రధాన మంత్రి కృషి సంచాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) ఉప పథకంగా కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్ ఆధునీకరణను కూడా మంత్రి వర్గం ఆమోదించింది.