calender_icon.png 14 March, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం

14-03-2025 08:41:25 AM

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam)లో శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు(devotees) తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి(Srivari Sarva Darshan) 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 51,148 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 21,236 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.56 కోట్లు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది. 

నేడు తిరుమలలో కుమారధార తీర్థ ముక్కోటి

నేడు తిరుమల(Tirumala)లో కుమారధార తీర్థ ముక్కోటి(Kumaradhara Mukkoti) కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కుమారధార తీర్థ ముక్కోటికి తిరుమల తిరుపతి దేవస్థానంఅన్ని ఏర్పాట్లు చేసింది. కుమారధార తీర్థం శేషాచల అడువుల్లో(seshachalam forests) కొలువై ఉంది. దీర్ఘకాలిక వ్యాధులు, వయోవృద్ధులు, చంటి పిల్లలకు అనుమతి నిరాకరించారు. భక్తుల కోసం అన్నప్రసాదాలు, తాగునీటిని టీటీడీ ఏర్పాటు చేసింది. అటు నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడసేవ కార్యక్రమం కొనసాగనుంది. పౌర్ణమి సందర్భంగా తిరుమాడ వీధుల్లో మలయప్పస్వామి(Malayappa Swamy) ఊరేగనున్నారు. రాత్రి 7 నుంచి 9 వరకు స్వామివారికి గరుడ సేవ.