21-03-2025 09:38:55 AM
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి (Tirumala darshan) 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. శీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం తిరుమల వెంకన్నను 58,872 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,523 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలతో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.71 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు(TTD officials) ప్రకటించారు. నేడు జూన్ నెల తిరుమల శ్రీవారి దర్శన టికెట్స్ విడుదలకానున్నాయి. ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శన టికెట్స్ ను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవ టికెట్స్, 11 గంటలకు జేష్ఠాభిషేకం టికెట్స్ విడుదల చేయనున్నట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది.