13-03-2025 08:29:38 AM
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanams) భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. 68,509 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 23,105 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, రూ.3.86 కోట్లు హుండీ ఆదాయం తిరుమల దేవస్థానం ప్రకటించింది.