calender_icon.png 25 October, 2024 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిట్‌గా ఉండడం కోసం..

28-05-2024 12:05:00 AM

అందరికి ఫిట్‌గా ఆరోగ్యంగా ఉండాలని ఉంటుంది. కానీ ఉరుకుల పరుగుల జీవితంలో ఫిట్‌గా ఉండడం కోసం, ఆరోగ్యంగా ఉండడం కోసం జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రతీరోజూ వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. చేసే పని మీద దృష్టి పెడతారు. శక్తిపెరిగినట్టుగా  కూడా అనిపిస్తుంది. జిమ్‌కు వెళ్లకుండానే ఫిట్‌గా ఉండడం కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత నడవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీని వల్ల ఆరోగ్యంగా ఉంటారు.. ఫిట్‌గా కూడా ఉంటారు.

2. ప్రతి సాయంత్రం స్నాక్స్‌లో భాగంగా డ్రైఫ్రూట్స్, అరటిపండ్లు, యాపిల్స్‌లాంటివి తీసుకోవాలి.

3. సరిపడా నిద్ర ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కు ఒక మెడిసన్‌లా పనిచేస్తుంది. మనల్ని ఉత్తేజవంతులుగా ఉంచడమే కాకుండా.. మనలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అందుకే ప్రతిరోజూ ఏడు గంటలు నిద్రకు కేటాయించాలి.

4. శారీరక శ్రమ చేయడం వల్ల శరీరంలో నుంచి చెమట ద్వారా విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో ఉత్తేజకరంగా ఉంటారు. పెరడులో పని చేయడం కూడా శారీరక శ్రమ కిందికే వస్తుంది. ఒకవేళ ఇది కుదరని వారు ఒక 10-15 నిమిషాలు పరిగెత్తాలి. పైన ఇచ్చిన సూచనలను అమలు చేయడం వల్ల యాక్టివ్‌గా ఉంటారు. ఫిట్‌గా ఆరోగ్యంగా కూడా ఉంటారు.