calender_icon.png 2 May, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పు ఎక్కువైందా?

23-03-2025 12:00:00 AM

వంట చేసేటప్పుడు కొన్నిసార్లు ఉప్పు ఎక్కువగా లేదా తక్కువగా వేయడం సహజం. వంటలో ఉప్పు తక్కువైతే మళ్లీ వేసుకోగలం. పొరపాటున అదనంగా ఉప్పు వేస్తే.. మీరు ఎంతో కష్టపడి తయారు చేసిన వంట తినడం అసాధ్యంగా మారుతుంది. ఎక్కువ ఉప్పు వల్ల మొత్తం ఆహారం రుచే చెడిపోతుంది. వంట చేసే ప్రతి ఒక్కరూ తరచూ ఈ సమస్య ఎదుర్కొంటూనే ఉంటారు. అయితే ఇలా అయిందని మీరు కంగారుపడాల్సిన అవసరం లేదు. ఆహారంలో ఉప్పును తగ్గించేందుకు కింది చిట్కాలు పాటిస్తే చాలు. 

ఆలుగడ్డలను ఉపయోగించి ఆహారంలో ఉప్పును తగ్గించవచ్చు. అదెలాగంటే.. వండిన ఆహారంలో ఉడికించిన ఆలుగడ్డ ముక్కలను కలపాలి. ఇవి ఆహారంలో అదనపు ఉప్పును గ్రహిస్తాయి. అందువల్ల పర్‌ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. 

ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గించడానికి పెరుగును ఉపయోగించవచ్చు. కూరగాయలు వండేటప్పుడు వాటి లో పెరుగు వేసి ఉడికించాలి. ఇది ఉప్పును తగ్గించడమే కాకుండా రుచిని కూడా పెంచుతుంది. 

నెయ్యి ఏ ఆహార పదార్థం రుచినైనా రెట్టింపు చేస్తుంది. అంతేకాదు.. నెయ్యికి ఆహారంలో అధిక ఉప్పును తగ్గించే శక్తి ఉంది. తరచూ తీసుకోవడమూ ఆరోగ్యానికి చాలా మంచిది. 

కొన్ని రకాల కూరగాయలు వండిన తర్వాత ఉప్పును అధికంగా పీల్చుకుంటాయి. ఇలాంటప్పుడు నిమ్మకాయ రసాన్ని ఆహారంలో కలిపి తీసుకోవాలి. ఇందులోని పులుపు అదనపు ఉప్పును సమతుల్యం చేసి పదార్థానికి ప్రత్యేక రుచిని తీసుకొస్తుంది. 

ఆహారంలో అదనపు ఉప్పు ను తగ్గించే మరో మార్గం బియ్యం, కార్న్‌ఫ్లోర్ లేదా ఏదైనా పిండితో చేసిన బాల్స్ వంటకంలో వేసి కొంతసేపు ఉడికించాలి. అప్పుడు ఆహారంలోని ఉప్పు పరిమాణం తగ్గిపో తుంది.