calender_icon.png 24 October, 2024 | 2:01 PM

యంగ్‌గా కనిపించాలంటే!

04-06-2024 12:05:00 AM

అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ ప్రపంచంలో అందానికి ఉండే ప్రాధాన్యత అలాంటిది మరీ... కానీ కొంత వయసు తర్వాత మృతకణాలతో వృద్ధాప్య ఛాయలు అందాన్ని తగ్గిస్తాయి. అటువంటి సందర్భాల్లో యవ్వనంగా కనబడడానికి ప్రజలు అనేక సౌందర్య సాధనాలను ఉపయోగిస్తారు. అంతే కాకుండా యాంటీ ఏజింగ్ చికిత్సలు కూడా చేయించుకుంటారు. అయితే వీటి వల్ల చర్మానికి హాని కలుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల సహజసిద్ధంగా యవ్వనంగా ఉండొచ్చు.. అవెంటో తెలుసుకుందాం..

చేపలు వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. చేపలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. చేపలను తినడం వల్ల మీ చర్మం ముడతలు రాకుండా ఉంటుంది. గ్రీన్ టీ తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అంతేకాకుండా చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచి, మృదువుగా మారుస్తుంది. బెర్రీస్ చాలా మంది ఇష్టంగా తింటారు.. కానీ వీటి ఉపయోగాలు మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు.. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే బెర్రీస్ మనుషులను ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుతాయి.