calender_icon.png 24 October, 2024 | 5:42 PM

మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే!

04-06-2024 12:05:00 AM

కొంతమందికి మేకప్ ఎక్కువసేపు ఉండదు. అలా వేసుకుంటారో లేదో కొంతసేపటి తర్వాత ప్యాచెస్ ఏర్పడుతుంటాయి. మేకప్ ఎక్కువసేపు ఉండడానికి ఏవేవో చిట్కాలు అనుసరిస్తుంటారు. కొన్ని సార్లు ఏవీ పని చేయవు. మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

ఫేస్ వాష్

ఎప్పుడైనా సరే మేకప్ వేసుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అప్పుడు ముఖం మీద ఉన్న ఆయిల్ పోతుంది. ఒక వేళ ఇలా చేయకుండా మేకప్ వేసుకుంటే ముఖం మీదున్న జిడ్డు వల్ల మేకప్ పోతుంది. కాబట్టి మేకప్ వేసుకునే ముందు ఫేస్ వాష్ చేసుకోవాలి.

డీప్ క్లీన్

లైట్‌గా రోజ్ వాటర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రోజ్ వాటర్ వల్ల ముఖానికి కొన్ని  క్షణాల్లోనే గ్లో వస్తుంది. చర్మం కూడా పొడిగా మారుతుంది. రోజ్ వాటర్ పెట్టిన తర్వాత కాసేపు ముఖానికి గాలి తగిలేలా ఉండాలి.

ఐస్ మసాజ్

మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే ఐస్ మసాజ్ చేయాలి. రెండు లేదా మూడు ఐస్ క్యూబ్స్ తీసుకుని ముఖాన్ని బాగా మసాజ్ చేయాలి. ముఖం అంతటా రుద్దాలి. మేకప్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉండడానికి ఆస్కారం ఉంటుంది.

మాయిశ్చరైజర్

ఈ ప్రాసెసంతా అయిపోయిన తర్వాత ముఖం మీద పూర్తిగా మాయిశ్చరైజర్ అప్లు చేయాలి. జిడ్డు చర్మమున్న వారు లిక్విడ్ మాయిశ్చరైజర్‌ని ఉపయోగించడం మంచిది. ఈ చిట్కాలను పాటిస్తే మేకప్ ఎక్కువ సేపు ఉంటుంది. అయితే నిద్రపోయే ముందు కచ్చితంగా మేకప్ తీసివేయాలి లేకుంటే మేకప్ ముఖం మీద ఎక్కువసేపు ఉండడం వల్ల అందులోని కెమికల్స్‌తో ఇతర సమస్యలు తలెత్తుతాయి.