calender_icon.png 22 February, 2025 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక అక్రమ రవాణా టిప్పర్ పట్టివేత..

21-02-2025 12:10:48 AM

చింతలపాలెం, ఫిబ్రవరి 20: అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ను గురువారం చింతలపాలెం పోలీసులు పట్టుకున్నారు. చింతలపాలెం ఎస్‌ఐ అంతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రా లోని కాసరబాద్ ఇసుక రీచ్ నుండి దొండపాడు వైపు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్ (ఏపీ 39 డబ్ల్యూ 2520) ను బుగ్గ మాధవరం రోడ్డు లో పట్టుకున్నారు.

సరైన అనుమతులు లేకపోవడంతో టిప్పర్ డ్రైవర్ మర్రి కొండలరావును అదుపులోకి తీసు కుని, వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్త్స్ర అంతిరెడ్డి తెలిపారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని అన్నారు.