calender_icon.png 18 April, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న టిప్ప‌ర్ సీజ్‌

15-04-2025 04:53:01 PM

మునిప‌ల్లి: అక్ర‌మంగా ఎలాంటి ప‌త్రాలు లేకుండా ఇసుక త‌ర‌లిస్తున్న ఇసుక టిప్ప‌ర్ ను మునిప‌ల్లి పోలీసులు ప‌ట్టుకొని సీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా మునిప‌ల్లి ఎస్ఐ రాజేష్ నాయ‌క్ తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఇస్మాయిల్ ఖాన్ పేట నుంచి బీదర్ కుఅక్ర‌మంగా ఇసుకను త‌ర‌లిస్తున్న స‌మాచారం రావ‌డంతో మునిప‌ల్లి పోలీసులు మండ‌లంలోని కంకోల్ టోల్ ప్లాజా వ‌ద్ద వాహ‌నాల త‌నిఖీలు చేప‌ట్టారు. త‌నిఖీలు చేస్తున్న క్ర‌మంలో ఇసుక లోడ్ తో వ‌స్తున్న టిప్ప‌ర్ ఆపి త‌నిఖీ చేయ‌గా ఎలాంటి ప‌త్రాలు లేక‌పోవ‌డంతో సీజ్ చేసి పీఎస్ కు త‌ర‌లించారు. విచారించ‌గా ఇస్మాయిల్ ఖాన్ పేట నుంచి తీసుక‌వ‌చ్చి బీద‌ర్ లో ఎక్కువ ధ‌రకు విక్ర‌యిస్తున్న‌ట్లు టిప్ప‌ర్ఒ డ్రైవ‌ర్, ఓన‌ర్ ఒప్పుకున్నారు. ఈ మేర‌కు టిప్పర్ డ్రైవర్ అంకుష్ నవండే, టిప్పర్ యజమాని ప్రవీణ్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న‌ట్లు ఎస్ఐ రాజేష్ నాయ‌క్ తెలిపారు.