calender_icon.png 24 February, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎదురెదురుగా వస్తున్న టిప్పర్,కారు ఢీ..

24-02-2025 12:41:17 AM

కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 23(విజయ క్రాంతి):ఎదురెదురుగా వస్తున్న టిప్పర్,కారు ఢీకొని కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొంపల్లి మున్సిపల్ దూలపల్లి కి చెందిన దున్నాల నాగవంశీ (22)వృత్తి రీత్యా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.ఆదివారం ఉదయం 06:45 నిమిషాలకు మియాపూర్ నుండి గండిమైసమ్మకు కారులో బయలుదేరాడు.

భౌరంపేట్ స్నేక్ పార్క్ జంక్షన్ దగ్గరకు రాగానే గండిమైసమ్మ నుండి ప్రగతి నగర్ వైపు వెళ్తున్న టిప్పర్ అతివేగంగా వచ్చి కారును ఢీ కొట్టింది.దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయి కారు డ్రైవింగ్ చేస్తున్న దున్నాల నాగవంశీ అక్కడికక్కడే మృతి చెందాడు.ప్రమాదానికి గురైన కారును వెనుక నుండి మరో బైక్‌ఢీ కొనడంతో బాచుపల్లి కి చెందిన చిట్టూరి వెంకట సురేంద్ర(32) కాలుకు గాయాలయ్యాయి.చికిత్స కొరకు సూరారం మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతీష్ తెలిపారు.