ఎన్నికల అధికారులకు బక్కా జడ్సన్ ఫిర్యాదు
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తీన్మార్ మల్లన్నను అనర్హుడిగా ప్రకటించాలని వరంగల్, ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్కా జడ్సన్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుంగతుర్తి నియోజ కవర్గంలోని తిరుమలగిరిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తీన్మార్ మల్లన్న ఓట ర్లను బ్లాక్‌మెయిల్ చేసేలా వ్యవహరించారని తెలిపారు. ‘శాసనమండలికి పంపుతారా..? స్మశానానికి పంపుతారా..? అని వ్యాఖ్యానించారని ఆరోపించారు. ఇదే అంశంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులతో పాటు ఎమ్మె ల్సీ ఎన్నికల పరిశీలకుడు రాహుల్ బొజ్జాను, ఖమ్మంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. మల్లన్నను అనర్హుడిగా ప్రకటించ కపోతే ఖమ్మం కలెక్టరేట్ ముందు నిరహార దీక్ష చేస్తానని అన్నారు. మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించడానికి సీఎం రేవంత్‌రెడ్డి కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న అశోక్, మరో వ్యక్తి రాజును కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బరిలోకి దింపుతున్నారని ఆరోపించారు.