calender_icon.png 8 January, 2025 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టిమ్స్ పనులు త్వరగా పూర్తిచేయండి

08-01-2025 12:36:48 AM

మంత్రి కోమటి రెడ్డి 

మేడ్చల్, జనవరి 7: మల్కాజిగిరి నియోజకవర్గం అల్వాల్‌లో టిమ్స్ ఆస్పత్రి నిర్మా  అధికారుల అలసత్వంపై రోడ్లు భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల మధ్య సమన్వయం లేకనే పనుల్లో జాప్యం జరుగుతోందని మండిపడ్డారు. మంగళవారం ఆయన అల్వాల్‌లో టిమ్స్ నిర్మాణ పనులను పరిశీలించారు.

ఆగస్టు చివరి వరకు ఎట్టి పరిస్థితుల్లో పనులు పూర్తిచేయాలన్నారు. గత ప్రభుత్వం వాస్తు పేరిట మార్పులు చేర్పులు చేయడం వలన పనుల్లో జాప్యం జరిగిందని కాంట్రాక్టర్ మంత్రికి వివరించారు. కాగా ప్రభుత్వం అల్వాల్‌లో రూ.897  వెయ్యి పడకల టిమ్స్ ఆస్పత్రిని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.