calender_icon.png 1 February, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

౩ రెట్ల వేగం.. అదే మా ఆశయం

01-02-2025 12:30:00 AM

  1. 25 కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటకు తీసుకొచ్చామని వెల్లడి
  2. అందరి శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం
  3. మన్మోహన్‌కు ఘన నివాళి
  4. మధ్య తరగతి వారిపై మరింత దృష్టి
  5. త్వరలోనే ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్
  6. ఉభయసభలనుద్దేశించి ప్రసంగం 

మరో 3 కోట్ల ఇండ్లు

మధ్యతరగతి వారిపై మరింత దృష్టి

త్వరలోనే ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్

పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి 

రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము ప్రసంగం 

* భారతీయులందరి తరఫున రాజ్యాంగ రచనకు సహకరించిన మేధావులందరికీ నమస్కరిస్తున్నా. అంబే ద్కర్‌కు ప్రణామం చేస్తున్నా. ఈ ప్రభుత్వం రానున్న రోజుల్లో 3 కోట్ల మంది ‘లక్‌పతి దీదీ’లను తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈశాన్య రాష్ట్రాలు మొదటిసారిగా అష్టలక్ష్మి ఫెస్టివల్ ను నిర్వహించిన తీరుతో దేశం మొత్తం అబ్బురపడింది.  ఈ ప్రభుత్వం దేశంలోని మహిళలు, మధ్యతరగతి ప్రజలు, యువత, రైతుల మీద ఎక్కువ దృష్టి సారించింది. వారి శ్రేయస్సు కోసం పలు పథకాలను రూపొందిస్తోంది. 

 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 

న్యూఢిల్లీ, జనవరి 31: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఇటీవలే కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సభ శ్రద్ధాంజలి ఘటించింది. అలాగే మహాకుంభమేళా తొక్కిసలాటలో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను లోక్ సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 

ప్రభుత్వ లక్ష్యం అదే.. 

ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు. ‘రెండు నెలల కిందట 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. ఇటీవలే 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కూడా పూర్తి చేసుకున్నాం. భారతీయులందరి తరఫున రాజ్యాంగ రచనకు సహకరించిన మేధావులందరికీ నమస్కరిస్తున్నాను. అంబేద్కర్‌కు ప్రణామం చేస్తున్నా.

ఈ ప్రభుత్వం రానున్న రోజుల్లో 3 కోట్ల మంది ‘లక్‌పతి దీదీ’లను తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అనేక మంది మహిళలు ఫైటర్ జెట్‌లు నడుపుతున్నారు. అంతే కాక పోలీసులుగా రాణిస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలను నడిపిస్తున్నారు. ఈ విషయం మనందరికీ గర్వకారణం. అంతే కాకుండా ప్రపంచవేదికపై కూడా మన ఆడబిడ్డలు ఒలింపిక్ పతకాలు కూడా నెగ్గుతున్నారు.

ఈశాన్యరాష్ట్రాలు మొదటి సారిగా అష్టలక్ష్మి ఫెస్టివల్‌ను నిర్వహించిన తీరుతో దేశం మొత్తం అబ్బురపడింది.  సర్కార్ దేశంలోని మహిళలు, మధ్యతరగతి ప్రజలు, యువత, రైతుల మీద ఎక్కువ దృష్టి సారించింది. వారి శ్రేయస్సు కొరకు పలు పథకాలను రూపొందిస్తోంది.  “ప్రధానమంత్రి ఆవాస్ యోజన” పథకం కింద మరో మూడు కోట్ల ఇండ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం.

మధ్యతరగతి వారి ఇంటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ. 5.36 లక్షల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. “స్వామిత్వ” పథకం కింద ఇప్పటి వరకు 2.25 కోట్ల మందికి ఆస్తిపత్రాలను అందజేశాం. గడిచిన ఆరు నెలల కాలంలోనే 70 లక్షల ఆస్తి హక్కు పత్రాలను అందించాం.

“ముద్ర” పథకం కింద చిన్న పరిశ్రమలకు ఇచ్చే రుణసాయం రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచాం. ప్రస్తుతం దేశంలో 71 వందేభారత్, నమోభారత్ రైళ్లు సేవలందిస్తున్నా యి. గడిచిన ఆరు మాసాల్లో కొత్తగా మరో 17 వందేభారత్, ఒక నమో భారత్ రైళ్లు వినియోగంలోకి వచ్చాయి.

“స్వచ్ఛభారత్ అభియాన్‌” కింద దేశ వ్యాప్తంగా 12 కోట్ల కొత్త టాయిలెట్ల నిర్మాణానికి, “ప్రధాన మంత్రి ఉజ్వల యోజన” కింద 10 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. సరిహద్దుల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. దేశంలో నక్సలిజాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య 38కి చేరుకుంది.

రూ. 2000 కోట్లతో “మిషన్ మౌసం”ను ప్రారంభించి అన్నదాతలకు కచ్చితమైన వాతావరణ సమాచారాన్ని అందిస్తున్నాం. దేశంలో మెట్రో నెట్‌వర్క్ 1000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. వ్యాక్సినేషన్ కొరకు “యు పోర్టల్‌ను ప్రారంభించాం. “నేషనల్ రూరల్ లైవ్లీహుడ్‌” మిషన్ కింద 91 లక్షలకు పైగా స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పిస్తున్నాం.

“ఆయుష్మాన్ భారత్‌” పథకం కింద దేశంలోని 70 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ఆరోగ్య బీమాను పొందారు. వీరికి ఏడాదికి రూ. 5 లక్షల బీమా అందుతోంది. మూడోసారి ఏర్పడ్డ ఈ ప్రభుత్వం మూడురెట్ల వేగంతో పనిచేస్తోంది. నేడు దేశం ఎన్నో విషయాల్లో వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవడం మనం చూస్తున్నాం.

ఒకే దేశం ఎన్నిక, వక్ఫ్ సవరణ బిల్లు అమలు ఎంతో వేగవంతంగా, సాహసోపేతంగా పూర్తి చేశాం. పాలసీలను కూడా అదే వేగంతో అమలు చేస్తోంది. పేదవారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆర్టికల్ 370 రద్దు జమ్ముకశ్మీర్ స్థితిగతులనే మార్చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద భావాన్ని తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేసింది.

ఉదంపూర్ రైల్వే ప్రాజెక్టు పూర్తయింది. దీంతో దేశంలోని కశ్మీర్ వరకు రైల్ లైన్లతో అనుసంధానించబడింది. కృతిమమేధ రంగంలో భారత్‌ను ముందుంచేందుకు ప్రభుత్వం “ఇండియా ఏఐ మిషన్‌”ను ఆవిష్కరించింది. అంతరిక్ష రంగంలో భారత్ దూసుకుపోతుంది. గగన్‌యాన్ ప్రయోగం చేపట్టేందుకు ఎంతో దూరం లేదు. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు సమయం దగ్గరపడింది. 

ముర్ము నోట పోలవరం మాట

ఏపీకి జీవనాడి అయిన పోలవరం గురించి రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 12 వేల కోట్లు కేటాయించాం. దీంతో ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు అవకాశం ఏర్పడింది. ప్రాజెక్టు నిర్మాణానికి కట్టుబడి ఉన్నట్లు మరోమారు పేర్కొన్నారు.