క్యూఐబీ కోటాలో అత్యధిక బిడ్‌లు
న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా పబ్లిక్ ఇష్యూ ఎట్టకేలకు పూర్తి సబ్‌స్క్రిప్షన్ అందుకుంది.సబ్ స్క్రిప్షన్ గడువు చివరిరోజు పూర్తి సబ్‌స్క్రిప్షన్ అందుకోవడం గమనార్హం. రూ.27,870 కోట్ల ఐపీఓకు గురువారం సాయంత్రం 5.30 గంటల నాటికి 2.37 రెట్ల బిడ్లు దాఖలైనట్లు స్టాక్ ఎక్స్ఛేంజీల నమోదైన డేటా తెలియజేస్తోంది.
ముఖ్యంగా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల కోటా (క్యూఐబీ) 6.97 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్ అయ్యింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 50 శాతం సబ్‌స్క్రిప్షన్ అందుకోగా.. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల భాగం 60 శాతం సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. ఉద్యోగుల కోటా 1.74 రెట్ల బిడ్లు అం దుకుంది. గురువారంతో బిడ్ల దాఖలుకు గడువు ముగియనుంది.
సోమ వారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.8,315 కోట్లు సమీకరించింది. ఎల్‌ఐసీ కంటే అతిపెద్ద ఐపీఓ గా నిలిచిన హ్యుందాయ్ మోటార్.. పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఒక్కో షేరును రూ.1865- నిర్ణయి ంచింది. పూర్తి ఆఫర్ ఫర్ సేల్ రూపం లో షేర్లను విక్రయిస్తున్నారు. తాజా షేర్ల జారీ లేకపోవడం గమనార్హం.