calender_icon.png 28 September, 2024 | 3:01 AM

దారి తప్పుతున్న సర్కారు సార్లు

26-09-2024 02:53:10 AM

  1. క్రిప్టో కరెన్సీలో సూత్రదారులు పాత్రదారులు
  2. సెలవు పెట్టి మరీ వ్యాపార లావాదేవీలు
  3. పోలీసుల చేతికి చిక్కిన వ్యాపార  గుట్టు 
  4. ఇప్పటికే ఐదుగురు జైలు పాలు 
  5. తాజాగా ముగ్గురు అరెస్టుతో కలకలం

నిర్మల్, సెప్టెంబర్ 25 (విజయకాంతి): ని ర్మల్ జిల్లాలో క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ గొ లుసు వ్యాపారం రోజుకో సంచలనాన్ని సృ ష్టిస్తున్నది. ఈ వ్యాపారంతో సంబంధం ఉ న్న ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు అయి జైల్లో ఉండగానే తాజాగా మరో ముగ్గురు ఉ ద్యోగులను బుధవారం పోలీసులు ఆరెస్టు చే శారు.

మరో 20 మంది   ప్రభుత్వ ఉద్యోగులపై ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న ది. విద్య బుద్ధులు చెప్పే ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలకు రక్ష ణ కల్పించే పోలీసులు క్రిప్టో కరెన్సీ వ్యాపారంలో భాగం కావడం ఆయా శాఖలనుకు దిపేస్తోంది. ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించినట్టు విమర్శలొస్తున్నాయి. 

ఒక్క ఏడాదిలో 100 కోట్ల దందా!

ఖానాపూర్‌లో ప్రారంభమైన ఈ దందా నిర్మల్, ఖానాపూర్, భైంసా డివిజన్‌లలోని అ న్ని మండాలాలకు విస్తరించింది. నిర్మల్, ఖా నాపూర్, ముదోల్, తానూర్ కుబీర్, మా మ డ, దుస్తుబాదు, కడెం, బైంసా పట్టణాల్లో గొ లుసు వ్యాపారం విస్తరించినట్టు తెలుస్తున్నది. ఒక్క ఏడాది కాలంలోనే రూ.100 కో ట్ల వ్యా పారం జరిగినట్టు తెలుస్తున్నది.

ఇందులో పె ట్టుబడిదారులు, నిర్వాహకులు 80 శాతం ప్ర భుత్వ ఉద్యోగులే ఉండటం ఆయా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డబ్బులు ఉచితంగా రావని తెలిసినా సమాజాన్ని చైత న్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులు క్రి ప్టో దందా లో 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్, 2 స్టార్‌లుగా ఎదిగి జైలుపాలవుతున్నారు.

5 స్టార్‌లుగా ఉన్న రిటైర్డు ఆర్మీ ఉద్యోగి రాజ్‌కుమార్, ఎక్సై జ్ ఎస్సై గంగాధర్, ప్రభుత్వ టీచర్లు నరేష్, సాయికిరన్, కానిస్టేబుల్ మ హేష్‌లను నిర్మ ల్ పోలీసులు అరెస్టు చేసి జైలు కు పంపారు.  

కూపి లాగుతున్న పోలీసులు 

క్రిప్టో కరెన్సీలో ఐదుగురు మూఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు ఈ గొలుసు దందాలో భాగమైన మరికొందరి కదలికల పై కూపి లాగుతున్నట్టు తెలుస్తున్నది. అరెస్టు చేసిన వారి నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు మరికొందరిని అదుపులో ని తీసుకుని విచారణ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

కుబీర్ తానూర్, కడెం, దస్తరాబాదు, బైంసా, కుంటాల, ముదోల్, సోన్, నిర్మల్, ఖానాపూర్ మండలాల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు స్థానికులు తెలిపారు. అయితే అరెస్టుల పరవ్వ కొనసాగుతుండటంతో కొందరు ఫోన్‌లో సిమ్ కార్డులు మార్చి ఎవరికి కనపడకుండా జాగ్రత్త పడుతున్నారు.

కొందరు జిల్లా సరిహద్దులు దాటి మకాం మార్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ అవినాష్‌కుమార్ ఎవ్వరినీ వదలకుండా లోతుగా విచారణ చేస్తున్నారు. 

దందాలో వెయ్యి మంది టీచర్లు

ఈ వ్యాపారంలో మొత్తం ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఖ్య 1,000 వరకు ఉంటుందని సమాచారం. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే నెలకు రూ.14వేలు కమీషన్ వస్తుందని నమ్మకం కలిగించి ఉద్యోగుల బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులనే మోసం చేయడం గమనార్హం.

రూ.కోటి చేసిన వారికి స్టార్ 1, రూ.75 లక్షలు చేసిన వారికి స్టార్ 2, రూ.50 లక్షలు చేసిన వారికి స్టార్ 3, ఆ తర్వాత వారికి స్టార్ 4, 5, 6 ఇలా గ్రేడింగ్ ఇచ్చా రు. స్టార్ 3 వరకు ఉన్న వారిపై మొదట పోలీసులు కూపి లాగి అరెస్టులు చేశారు.

తాజా గా అరెస్టు అయిన వారిలో ఇద్దరు టీచర్లు మరొకరు ఇతర ఉద్యోగి ఉన్నారు. ఇప్పటి వర కు ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు కాగా తాజాగా మరో 20 మంది పోలీసుల  అదుపులో ఉండి విచారణ ఎదుర్కుంటున్నారు. 

ఒక్కొక్కరు రూ.కోట్లలో పెట్టుబడులు

తానూర్ మండలంలో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లు ఈ దందాలో నెలకు రూ.5 లక్షలు సంపాదించినట్టు ప్రచారం జరుగుతున్నది. కడెం, దస్తురాబాద్, నిర్మల్, కుబీర్, ఖానాపూర్‌లో పని చేస్తున్న మరో 20 మంది టీచర్లు స్టార్ 3లో ఉన్నారని తెలుస్తున్న ది. తానూర్‌లో దంపతులిద్దరు ఎల్వి గ్రామంలో సూమారు రూ.కోటి వరకు పెట్టుబడులు పెటించుకున్నట్టు తెలుస్తున్నది.

పెట్టుబడి పెట్టిన వారు పంటపొలాలను తాకట్టు పెట్టి సభ్యులుగా చేరినట్టు తెలిసింది. నిర్మల్‌లో ఎల్‌ఐసీ ఉద్యోగి రూ.కోటి పెట్టుబడి పెటించుకున్నట్టు సమాచారం. వ్యవసా య శాఖ ఉద్యోగి 200 మంది సభ్యుల ను చేర్చి కోటి రూపాయల వ్యాపారం చేసినట్టు తెలిసింది.

సంక్షేమ శాఖ ఉద్యోగి ఒకరు రూ.50లక్షలు, ఓ ఉపాధ్యాయ సంఘం నేత రూ.50 లక్షలు క్రిప్టోలో పెట్టుబడులు పెట్టించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. రియల్ వ్యాపారులు కూడా ఇందులో భారీగా పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వేల మంది బాధితులు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

ముగ్గురు ఉద్యోగుల అరెస్టు

క్రిప్టో కరెన్సీ మోసం కేసులో మరో ముగ్గురు ఉద్యోగులను బుధవారం అరెస్టు చేసినట్టు ఎస్పీ జానకి ష ర్మిల తెలిపారు. కడెం మండలం ఖానాపూర్‌కు చెందిన ఎస్జీటీ దాసరి రమేష్, భోథ్ మండలం సోనాలకు చెందిన బొమ్మడి ధనుంజయ్, పట్టణంలోని దివ్యనగర్‌కు చెందిన కిరమ్ వెంకటేష్‌లను అరె స్టు చేసినట్టు తెలిపారు.

క్రిప్టోతో సంబం ధం ఉన్న 11 బ్యాంకు ఖాతాలను నిలిపివేసినట్టు వెల్లడించారు. కొందరు ఉద్యోగు లు విదేశాల్లో నిర్వహించిన సమావేశాలకు హాజరైనట్టు ఆధారాలు లభించాయ ని, వారిని అరెస్టు  చేస్తామని ఎస్పీ చెప్పారు.