calender_icon.png 23 February, 2025 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాహ పరిచయ వేదికలను పేదలు సద్వినియోగం చేసుకోవాలి

23-02-2025 12:13:03 AM

టైమ్స్ మహా డెవలప్‌మెంట్ వివాహ పరిచయ వేదికకు అనూహ్య స్పందన

ముషీరాబాద్,(విజయక్రాంతి): వివాహా పరిచయ వేదికలను సద్వినియోగం చేసుకోవాలని ఎకనామిక్ టైమ్స్ మహా డెవలప్‌మెంట్ వ్యవస్థాపకులు ఏఎం డేవిడ్ రాజు(Economic Times Maha Development Founder AM David Raju) అన్నారు. ఈ మేరకు శనివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎకనామిక్ టైమ్స్ మహా డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివాహ పరిచయ వేదికకు అనూహ్య స్పందన లభించింది. ఈ పరిచయ వేదికకు వేదిక నిర్వహకుడు పి. భాస్కర్ రావు సమక్షంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ వివాహ పరిచయ వేదికలో దాదాపు 5 వందల మంది పిల్లల తల్లిదండ్రులు హాజరై తమ పిల్లలకు సంబంధించిన బయోడేటాను వేదికలో పరిచయం చేశారు. వివాహాలు చేసే తల్లిదండ్రులు తమ పిల్లల వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా ఏఎం డేవిడ్ రాజు మాట్లాడుతూ ఇలాంటి వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేసి పేదలకు అండగా నిలుస్తున్న వేదిక నిర్వహకులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్‌ఏఎస్ ఎస్‌సీ రైల్వే శాఖాధికారి పెరవలి కోటేశ్వర్ రావు, ప్రముఖ పారిశ్రామిక వేత్త డేవిడ్ నోబుల్, బిల్డర్ అత్తోట భాగ్యరాజ్, వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ కొమ్మెర డేవిడ్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.