25-04-2025 01:18:34 AM
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్ ఏప్రిల్ 24: (విజయ క్రాంతి): దరఖాస్తులు ఇచ్చిన నిర్ణీత గడువులోపు భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. భూమి హక్కుల రికార్డు లో ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ నూతన ఆర్‌ఓఆర్ 2025 చట్టం వెసులుబాటు కల్పిస్తుందని ఆయన తెలిపారు భీంగల్ వేల్పూర్ మండల కేంద్రాలలో భూభాగతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు.
జమ్మూ కాశ్మీర్ పైల్గాం ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారికి సదస్సులో రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పిం చారు. ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు కొత్త చట్టం వల్ల రైతులకు ప్రజలకు చేకూర ప్రయోజనాలు చట్టంలో పొందపరచిన కీలక అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
భూభారతి నమోదు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు భూముల రికార్డులలో తప్పులు ఉంటే ఈ చట్టం అమలులోకి వచ్చిన ఏడాది కాలంలో దరఖాస్తులను చేసుకోవాలని కలెక్టర్ సూచించారు అధికారులు గ్రామాలకు వెళ్లి అర్జీలు స్వీకరిస్తున్నారు ఈ అర్జీల పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా తప్పులను సరిచేస్తారని తెలిపారు.
తప్పులు ఉంటే ప్రజలు అప్పులు చేసుకోవాలని మొదటి అంచులు ఆర్డీవో ఆఫీస్ నుంచి తగు నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అప్పీల్ చేసుకునేందుకు భూభారత్ చట్టం అవకాశాన్ని కల్పిస్తుందని అప్పీలు చేసుకున్న చిన్న సన్నకారు రైతులకు ఉచిత న్యాయ సాయం అందిస్తామని తెలిపారు ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా భూమి పట్టా మ్యాపు తదితర అంశాలను పొందుపరుస్తున్నట్టు ఆయన తెలిపారు.
రిజిస్ట్రేషన్ కొటేషన్ చేయడానికి ముందు సర్వే మ్యాప్ ను రూపొందించి పట్టా పాస్ బుక్ లను జతపరుస్తారని తెలిపారు. ధరణిలోని భూ న్యాయస్థానాలను సమస్యల పరిష్కారానికి స్థానాలను ఆశ్రయించాల్సి వచ్చేదని ఆయన గుర్తు చేశారు. ధరణి పోర్టల్ ద్వారా కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ సదస్సులో డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి ఆర్మూర్ ఆర్డీవో రాజా గౌడ్ స్థానిక అధికారులు మార్కెట్ కమిటీ సొసైటీల చైర్మన్లు జిల్లా రైతులు పాల్గొన్నారు.