calender_icon.png 24 February, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండె ఆపరేషన్ కోసం సకాలంలో రక్తదానం

24-02-2025 12:00:00 AM

ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు

కామారెడ్డి (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో టేక్రియాల్ గ్రామానికి చెందిన లక్ష్మీ కి గుండె ఆపరేషన్ నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో సింగరాయపల్లి గ్రామానికి చెందిన అంకం బాలకిషన్ 8వ సారి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ గతములో గర్భిణీ  మహిళలకు, తలసేమియా చిన్నారుల కోసం రక్తదాత బాలకిషన్ రక్తదానం చేయడం జరిగిందనీ, నిస్వార్థ సేవలు రక్తదాతలని అని అన్నారు. సకాలంలో రక్తాన్ని అందజేసిన బాలకిషన్‌కు ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు.