సాయి రోనక్, అమృత చౌదరి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘రివైండ్’. క్రాస్ వైర్ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కళ్యాణ్ చక్రవర్తి దర్శకత్వం వహిస్తూ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఇందులో జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేశ్, భరత్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ నెల 18న ఈ సినిమాను దక్షిణాది థియేటర్లలో ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్న విషయాన్ని తాజాగా ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘కొత్త కాన్సెప్ట్‌తో టైమ్ ట్రావెల్ మీద ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.
తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని, కొత్త కంటెంట్‌ను ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. మా సినిమాకూ పెద్ద విజయం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఆశీర్వాద్; సినిమాటోగ్రఫీ: శివరామ్ చరణ్; ఎడిటర్: తుషార పాలా; పాటలు: రవివర్మ ఆకుల; స్క్రీన్ ప్లే, నిర్మాణం, దర్శకత్వం: కళ్యాణ్ చక్రవర్తి.