calender_icon.png 6 October, 2024 | 7:56 AM

ఎస్సీ వర్గీకరణ చేయకుండా కాలయాపన

06-10-2024 01:45:39 AM

బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల 

హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణకు ఆమోదం లభించి రెండు నెలలు దాటినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మా ట్లాడుతూ వర్గీకరణ అమలు చేయకుండా ఎలాంటి నియామకాలు చేయ మని అసెంబ్లీ సాక్షిగా చెప్పి, డిఎస్సీ ఫలితాలను ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించారు.

వర్గీకరణపై ఎన్నో కమిషన్లు వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని, ఎక్కడా అమలు చేయలేదని మండిపడ్డారు. వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్లను అమలు చేయకుంటే కాం గ్రెస్ మాదిగలను మోసం చేసినట్లేనని పేర్కొన్నారు. రిజర్వేషన్ల అమలుకు సర్కార్‌కు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.