02-03-2025 12:00:00 AM
ఈ రోజుల్లో భార్యాభర్తలు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితులున్నాయి. అయితే కుటుంబ సభ్యుల అవసరాలు, వంటా వార్పు, పిల్లల ఇలా.. అనేక పనులతోనే సరిపోతోంటుంది. ఇద్దరు హాయిగా మాట్లాడుకోవడానికి సమయం కూడా ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. ఆఫీసు పనిలో ఎంత బిజీగా ఉన్నా మధ్యలో ఓ అయిదు నిమిషాలు భాగస్వామి కోసం కేటాయించాల్సిందే.
తిన్నావా అనో, ఓ సరదా సందేశాన్నో, ప్రేమను పెంచే ఒక వీడియో గానీ పంచుకుంటే రోజంతా దూరంగా ఉన్నట్లు అనిపించదు. ఏ కారణంతో అయినా మీ భాగస్వామి ఆవేశంలో ఉంటే వారికి ఇంకా చిరాకు కలిగించే పనులు చేయకూడదు.
చేతిలో చెయ్యివేసి ఊరడించడం, దగ్గరికి తీసుకుని శాంత పరచడం, వారెందుకు అలా ఉన్నారో అర్థం చేసుకోవాలి. మొండిగా ఉండటం వల్ల సమస్య పరిష్కారం కాదు. తనే ముందు మాట్లాడతారని ఎదురు చూస్తూ ఉండకూడదు. అవతలి వ్యక్తికంటే ముందే మాట్లాడితే గౌరవం ఇంకా పెరుగుతుంది.